విశ్వంలో మరో 100 గ్రహాలు! | Another 100 planets in the universe! | Sakshi
Sakshi News home page

విశ్వంలో మరో 100 గ్రహాలు!

Jan 11 2016 1:44 AM | Updated on Sep 3 2017 3:26 PM

విశ్వంలో మరో 100 గ్రహాలు!

విశ్వంలో మరో 100 గ్రహాలు!

విశ్వంలో ఉన్న ఇతర గ్రహాల అన్వేషణ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన కెప్లర్ వ్యోమనౌక కొత్త గ్రహాలను కనుగొంది.

వాషింగ్టన్: విశ్వంలో ఉన్న ఇతర గ్రహాల అన్వేషణ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన కెప్లర్ వ్యోమనౌక కొత్త గ్రహాలను కనుగొంది. వేరే నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న 100కు పైగా గ్రహాలను తన రెండో దశలో కెప్లర్ (కె-2 మిషన్) గుర్తించింది. యాంత్రిక లోపాల వల్ల ఈ కెప్లర్ దారి తప్పింది. కొత్త గ్రహాలు నక్షత్రం చుట్టూ తిరుగుతూ కెప్లర్‌ను దాటినపుడు నక్షత్రాల వెలుగుకు అడ్డు రావడంతో చిన్న మచ్చ ఏర్పడుతుంది. దీన్ని బట్టి అవి ఆ నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలుగా అంచనా వేశారు. 2013 మేలో కెప్లర్‌తో సంబంధాలు తెగాయి. అయితే దీన్ని ఆ తర్వాత శాస్త్రవేత్తలు తిరిగి గుర్తించి, టెలిస్కోప్ సాయంతో వెంబడిస్తున్నారు.

ఈ గ్రహాలతోపాటు మరిన్ని గుర్తించే సామర్థ్యం కె-2కు ఉందని ఇయాన్ క్రాస్‌ఫీల్డ్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఈ కెప్లర్‌ను ప్రయోగించిన మొదటి 80 రోజుల్లో దాదాపు 60 వేల నక్షత్రాలను గుర్తించిందని, 7 వేలకు పైగా వెలుతురు విరజిమ్మే సిగ్నల్స్‌ను కనుగొందని ఆయన తెలిపారు. కొత్త గ్రహాల అన్వేషణ కోసం పాలపుంత మొత్తం గాలించేందుకు కెప్లర్‌ను 2009లో ప్రయోగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement