అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకుడు అన్నా హజారే అమెరికాలోని న్యూయార్క్‌లో జరగనున్న భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కానున్నారు.
అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకుడు అన్నా హజారే అమెరికాలోని న్యూయార్క్‌లో జరగనున్న భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కానున్నారు. న్యూయార్క్‌లో ఆగస్టు 18న వేలాది మంది తిలకించనున్న స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌ను హజారే ముఖ్య అతిథిగా తిలకించనున్నారు.
అమెరికాలోని భారతీయ సంఘాల సమాఖ్య ఆహ్వానం మేరకు హజారే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆగస్టు 16న న్యూయార్క్ చేరుకోనున్నారు. రెండు వారాల పాటు అమెరికాలో పర్యటించనున్న హజారే, ఈ సందర్భంగా పలువురు ప్రముఖులతో భేటీ కావడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.