గగనతలంపై తిరుమల ఆలయానికి సమీపంలోనే బుధవారం ఓ విమానం ప్రయాణించింది.
	తిరుమల: గగనతలంపై తిరుమల ఆలయానికి సమీపంలోనే బుధవారం ఓ విమానం ప్రయాణించింది. ఉదయం 8 గంటల సమయంలో ఆలయ గగనతలంలో పడమర దిశ నుంచి తూర్పు దిశగా విమానం వెళ్లింది. ఆలయానికి అతి సమీపంలో విమానాలు ప్రయాణించడం భద్రతా కారణాల రీత్యా టీటీడీని కలవరపెడుతోంది.
	
	దీనిపై కేంద్రానికి టీటీడీ ఫిర్యాదు కూడా చేసింది. ఆలయ సమీప ప్రాంతంలో విమాన ప్రయాణాన్ని నిషేధిస్తామని సాక్షాత్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రకటించినా అమలు కాలేదు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
