భార్య బలవన్మరణం.. డాక్టర్ అరెస్ట్ | AIIMS Doctor Arrested After Wife Blames Him in Suicide Note: Police | Sakshi
Sakshi News home page

భార్య బలవన్మరణం.. డాక్టర్ అరెస్ట్

Apr 19 2015 7:52 PM | Updated on Aug 16 2018 4:07 PM

భార్య బలవన్మరణం.. డాక్టర్ అరెస్ట్ - Sakshi

భార్య బలవన్మరణం.. డాక్టర్ అరెస్ట్

భార్య ఆత్మహత్యకు కారకుడయ్యాడనే ఆరోపణలతో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యుడొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

న్యూఢిల్లీ: భార్య ఆత్మహత్యకు కారకుడయ్యాడనే ఆరోపణలతో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యుడొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కమల్ వేది ఎయిమ్స్ లో రెసిడెంట్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ప్రియ వేది(31) శనివారం ఆత్మహత్య చేసుకుంది. తూర్పు ఢిల్లీలోని పహర్ గంజ్ లో ఓ హోటల్ లో మణికట్టు కోసుకుని ఆమె ప్రాణాలు తీసుకుంది.

తన భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ లో పేర్కొంది. అలాగే తమ వ్యక్తిగత జీవితం గురించి కూడా తన భర్త అసత్యాలు ప్రచారం చేశాడని అందులో వెల్లడించింది. ప్రియ కూడా ఎయిమ్స్ లో రెసిడెంట్ డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఐదేళ్ల క్రితం కమల్ వేదిని ఆమె పెళ్లాడారు. నిందితుడిపై ఆత్మహత్యకు పురికొల్పడం, వరకట్న వ్యతిరేక చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement