ఆ సీన్‌ కట్‌.. అప్పుడే మొదలైన లీకులు! | Ae Dil Hai Mushkil CBFC report leaked | Sakshi
Sakshi News home page

ఆ సీన్‌ కట్‌.. అప్పుడే మొదలైన లీకులు!

Oct 23 2016 7:54 PM | Updated on Sep 4 2017 6:06 PM

ఆ సీన్‌ కట్‌.. అప్పుడే మొదలైన లీకులు!

ఆ సీన్‌ కట్‌.. అప్పుడే మొదలైన లీకులు!

అనుష్క ఘాటైన ముద్దు సన్నివేశాన్ని కొంత కట్‌ చేశారు...

కరణ్‌ జోహార్‌ ఏ ముహూర్తంలో ’యే దిల్‌ హై ముష్కిల్‌’ ని ప్రారంభించాడో కానీ.. ఆ సినిమాను అన్నీ కష్టాలే చుట్టుముడుతున్నాయి. పాకిస్థాన్‌ నటుడు నటించినందుకు ఈ సినిమాపై నిషేధం విధించాలన్న డిమాండ్‌ పెద్ద దుమారం రేపింది. ఈ విషయంలో ముందస్తుగా రాజీ కుదుర్చుకొని ఎలాగోలా విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇంతలో లీకులు, పైరసీ కష్టాలు సినిమాను చుట్టుముడుతున్నట్టు కనిపిస్తోంది.  

’యే దిల్‌ హై ముష్కిల్‌’  సినిమాకు సంబంధించి తాజాగా చిత్ర సెన్సార్‌ సర్టిఫికేట్‌, సెన్సార్‌ రిపోర్ట్‌ లీకైంది. కేంద్ర సెన్సార్‌ బోర్డు (సీబీఎఫ్‌సీ) ఈ సినిమాకు యూఏ సర్టిఫికేట్‌ ఇచ్చింది. సెన్సార్‌ బోర్డు యూఏ సర్టిఫికేట్‌ ప్రకారం.. 13 ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రుల తోడు ఉంటేనే ఈ సినిమాను చూడాల్సి ఉంటుంది.

రణ్‌బీర్‌ కపూర్‌, ఐశ్యర్యరాయ్‌, అనుష్క శర్మ, ఫవాద్‌ ఖాన్‌ ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమాలో పలు ఘాటు సన్నివేశాలు ఉన్నట్టు వినిపిస్తోంది. ఇప్పటికే చిత్రయూనిట్‌ రణ్‌బీర్‌ కపూర్‌, ఐశ్వర్య హాట్‌ హాట్‌ ఫొటోలను విడుదల చేసింది. అయితే, లీకైన సెన్సార్‌ రిపోర్ట్‌ ప్రకారం ఈ సినిమాలో మొత్తం మూడు కత్తెరలు పడ్డాయి. అనుష్క ఘాటైన ముద్దు సన్నివేశాన్ని కొంత కట్‌ చేశారు. పెదవులతో పెదవులను పేనవేసుకొని లిప్‌లాక్‌ చేసే ఈ సన్నివేశాన్ని సగానికి తగ్గించారు. అలాగే ’కిస్కా జాదా హాట్‌ హై’ అనే డైలాగ్‌ను ’కౌన్‌ జాదా హాట్‌ హై’గా మార్చారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement