'శుభయాత్ర' ప్రచారకర్తగా మోహన్ లాల్ | Actor Mohanlal goodwill ambassador of 'Subhayatra' drive | Sakshi
Sakshi News home page

'శుభయాత్ర' ప్రచారకర్తగా మోహన్ లాల్

Jul 6 2015 8:15 PM | Updated on Aug 17 2018 2:34 PM

'శుభయాత్ర' ప్రచారకర్తగా మోహన్ లాల్ - Sakshi

'శుభయాత్ర' ప్రచారకర్తగా మోహన్ లాల్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కేరళ ప్రభుత్వం చేపట్టనున్న 'శుభయాత్ర' కార్యక్రమం ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు.

తిరువనంతపురం: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్  కేరళ ప్రభుత్వం చేపట్టనున్న 'శుభయాత్ర' కార్యక్రమం ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. గుడ్ విల్ అంబాసిడర్ గా ఆయనను ప్రభుత్వం ఎంపిక చేసింది. ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది.

రవాణా, విద్య, పబ్లిక్ వర్క్స్ శాఖలతో కలిసి కేరళ పోలీసులు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరగడంతో 'శుభయాత్ర'కు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ట్రాఫిక్ నిబంధనల పాటించాల్సిన ఆవశ్యకతను ప్రజలను వివరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement