బస్సు బోల్తా : ఏడుగురు మృతి | 7 killed, 29 injured as bus overturns in China | Sakshi
Sakshi News home page

బస్సు బోల్తా : ఏడుగురు మృతి

Apr 7 2015 8:23 AM | Updated on Sep 2 2017 11:59 PM

బస్సు బోల్తా పడి ఏడుగురు మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు.

బీజింగ్:  బస్సు బోల్తా పడి ఏడుగురు మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు. ఈ సంఘటన చైనాలోని యునాన్ ప్రావెన్స్లో సోమవారం చోటు చేసుకుంది. 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు... గార్డ్రైలును ఢీ కొని బోల్తా పడింది. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మరణించారని పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement