బెంగళూరులో 54 కేజీల బంగారం స్వాధీనం | 54 kilos of gold seized in bangalore airport | Sakshi
Sakshi News home page

బెంగళూరులో 54 కేజీల బంగారం స్వాధీనం

Feb 23 2014 1:37 AM | Updated on Sep 2 2017 3:59 AM

అక్రమంగా 54 కేజీల బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు శనివా రం అరెస్ట్ చేశారు.

సాక్షి ప్రతినిధి, బెంగళూరు: అక్రమంగా 54 కేజీల బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు శనివా రం అరెస్ట్ చేశారు. కోల్‌కతాకు చెందిన రవివర్మ, బాలసుబ్రమణ్యం, ఈశ్వరమూర్తి కోయంబత్తూరుకు అక్రమంగా రూ.16.5 కోట్ల విలువైన 54 కేజీల బంగారాన్ని తరలించడానికి పూనుకున్నారు. కస్టమ్స్ అధికారుల కన్నుగప్పి కోల్‌కతాలో జెట్ ఎయిర్ వేస్ విమానమెక్కి కోయంబత్తూరుకు బయలుదేరారు.

ఈ విషయం తెలుసుకున్న బెంగళూరు కస్టమ్స్ అధికారులు.. విమానం మార్గమధ్యంలో బెంగళూరులో ఆగడంతో తనిఖీ చేశారు. స్మగ్లర్లకు సంబంధించిన లగేజీ బ్యాగుల్లో దాచిన 54 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement