ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరిన మృతదేహాలు | 5 dead bodies of engineering students arrived to hyderabad | Sakshi
Sakshi News home page

ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరిన మృతదేహాలు

Jun 10 2014 1:01 AM | Updated on Sep 2 2017 8:33 AM

హిమాచల్ ప్రదేశ్ లో ఆదివారం చోటు చేసుకున్న ఘోర ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలను హైదరాబాద్ కు తరలించారు.

హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ లో ఆదివారం చోటు చేసుకున్న ఘోర ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు విద్యార్థుల మృతదేహాలను హైదరాబాద్ కు తరలించారు. సోమవారం చేపట్టిన గాలింపు చర్యల్లో4 విద్యార్థుల మృతదేహాల ఆచూకీ మాత్రమే లభించింది.  మృతదేహాలకు కులుమనాలిలో శవపరీక్షలు నిర్వహించిన అనంతరం సాయంత్రం ప్రత్యేక సైనిక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు తరలించారు. మృతిచెందిన వారిని ఆకుల విజేత, గంపల ఐశ్వర్య,  రాంబాబు, లక్ష్మిలుగా గుర్తించారు. ఇంకా 20 మంది విద్యార్థుల ఆచూకీ లభించాల్సి ఉంది. ఆ ప్రమాద ఘటన నుంచి క్షేమంగా బయటపడ్డ 24 మంది విద్యార్థులు కూడా హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు.

 

నిన్న హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో 24 మంది విద్యార్థులు గల్లంతైన సంగతి తెలిసిందే. ల్యాడ్జి డ్యాం గేట్లను ఆకస్మికంగా తెరవడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ రోజు తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement