ప్రసాదం తిని 45 మందికి అస్వస్థత | 45 fall ill in Tripura after eating 'prasad' | Sakshi
Sakshi News home page

ప్రసాదం తిని 45 మందికి అస్వస్థత

Nov 5 2013 1:55 PM | Updated on Oct 5 2018 6:48 PM

ఉత్తర త్రిపురలోని కంచన్పూర్లో నిన్న రాత్రి జరిగిన దైవ సంబంధ కార్యక్రమంలో ప్రసాద వితరణలో భాగంగా ప్రసాదం తిని 45 మంది అస్వస్థతకు గురయ్యారని ఆ రాష్ట్ర వైద్యశాఖ ఉన్నతాధికారి అగర్తలాలో వెల్లడించారు.

ఉత్తర త్రిపురలోని కంచన్పూర్లో నిన్న రాత్రి జరిగిన దైవ సంబంధ కార్యక్రమంలో ప్రసాద వితరణలో భాగంగా ప్రసాదం తిని 45 మంది అస్వస్థతకు గురయ్యారని ఆ రాష్ట్ర వైద్యశాఖకు చెందిన ఉన్నతాధికారి మంగళవారం అగర్తలాలో వెల్లడించారు. అస్వస్థతకు గురైన వారందరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

 

అలాగే రెండు వైద్య బృందాలను ఇక్కడ నుంచి ప్రత్యేకంగా పంపినట్లు పేర్కొన్నారు. వైద్యులు రోగులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. వారి కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. అయితే వారిలో 15 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపారు.

 

అస్వస్థతకు గురైన వారిలో చిన్నారులు, మహిళలు ఉన్నారని తెలిపారు.  ప్రసాదం కలుషితం కావడం వల్లే వారు అస్వస్థతకు గురైనట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. ఆ ప్రసాదం తాలుక నమూనాను ఇప్పటికే సేకరించి, పరిశోధనశాలకు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement