కరాచి ఎయిర్‌పోర్టుపై ఉగ్రవాదుల దాడి | 11 dead in attack on Karachi airport | Sakshi
Sakshi News home page

కరాచి ఎయిర్‌పోర్టుపై ఉగ్రవాదుల దాడి

Jun 9 2014 8:12 AM | Updated on Sep 2 2017 8:33 AM

కరాచి జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై ఉగ్రవాదుల దాడి చేసిన ఘటనలో 11 మంది మృతి చెందారు.

పాకిస్థాన్‌: కరాచి జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై ఉగ్రవాదుల దాడి చేసిన ఘటనలో 11 మంది మృతి చెందారు. ఆదివారం రాత్రి పాత విమానాశ్రయం భవనాన్ని చుట్టుముట్టిన ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఎయిర్ భద్రతా సిబ్బంది(ఏఎస్ఎఫ్) వేషాల్లో వచ్చిన 10 మంది తీవ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు.

అయితే ఏ విమానాన్ని ధ్వంసం చేయలేదని వెల్లడించారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు తీవ్రవాదులు మృతి చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement