ఆఫ్ఘానిస్థాన్లోని హెల్మండ్ ప్రావెన్స్లో భద్రత దళాలు తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టాయి.
ఆఫ్ఘానిస్థాన్లోని హెల్మండ్ ప్రావెన్స్లో భద్రత దళాలు తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టాయి. అందులోభాగంగా 10 మంది తీవ్రవాదులు హతమైయ్యారు. మరో 20 మంది తీవ్రవాదులు గాయపడ్డారని భద్రత దళ ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. అనంతరం భద్రత దళాలు స్థానికంగా చేపట్టిన తనిఖీలలో 71 శక్తిమంతమైన పేలుడు పదార్థాలతోపాటు మోటర్ సైకల్ బాంబును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న బాంబులను నిర్వీర్యం చేసినట్లు తెలిపారు.
హెల్మండ్ ప్రావెన్స్లోని సంగిన్ జిల్లాలోని ఫత్తే మహ్మద్ పించ్ పరిసర ప్రాంతాలలో తీవ్రవాదులు ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. పోలీసులతో కలసి తీవ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. హెల్మండ్ ప్రావెన్స్ తాలిబన్లకు అత్యంత అనుకూలమైన ప్రాంతమని భద్రత దళ ఉన్నతాధికారి తెలిపారు. అయితే తీవ్రవాదులపై భద్రత దళాల దాడిపై తాలిబన్లు ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.