breaking news
Helmand province
-
మిలిటెంట్ల కౌంటర్ ఎటాక్.. 13 మంది మృతి
నవా(అఫ్ఘనిస్థాన్): ఉగ్రవాద ప్రతీకార దాడితో అఫ్ఘనిస్థాన్ దక్షిణ హెల్మండ్ ప్రాంతం నెత్తురొడింది. ఆదివారం సాయంత్రం నవా జిల్లాలో జరిగిన ఉగ్రవాద ఆత్మాహుతి దాడిలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారు. దోపుల్ ప్రాంతంలో వాహనంలో వచ్చిన ఓ ఉగ్రవాది మానవ బాంబుగా మారి పేల్చుకోవటంతో ఈ దారుణం చోటు చేసుకుంది. తొలుత ఇద్దరు మాత్రమే చనిపోయారని అధికారులు ప్రకటించినప్పటికీ ఆ సంఖ్య ఇప్పుడు 13కు చేరింది. చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని చెబుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, రెండు రోజుల క్రితం అఫ్ఘనిస్థాన్, విదేశీ సైన్యాలు సంయుక్తంగా హెల్మండ్ ప్రాంతంలో వైమానిక దాడులు నిర్వహించి 21 మంది తాలిబన్ మిలిటెంట్లను మట్టుపెట్టాయి. ఈ నేపథ్యంలో సైన్యమే లక్ష్యంగా తాలిబన్ గ్రూప్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. -
10 మంది తాలిబన్ తీవ్రవాదులు హతం
ఆఫ్ఘానిస్థాన్లోని హెల్మండ్ ప్రావెన్స్లో భద్రత దళాలు తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టాయి. అందులోభాగంగా 10 మంది తీవ్రవాదులు హతమైయ్యారు. మరో 20 మంది తీవ్రవాదులు గాయపడ్డారని భద్రత దళ ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. అనంతరం భద్రత దళాలు స్థానికంగా చేపట్టిన తనిఖీలలో 71 శక్తిమంతమైన పేలుడు పదార్థాలతోపాటు మోటర్ సైకల్ బాంబును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న బాంబులను నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. హెల్మండ్ ప్రావెన్స్లోని సంగిన్ జిల్లాలోని ఫత్తే మహ్మద్ పించ్ పరిసర ప్రాంతాలలో తీవ్రవాదులు ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. పోలీసులతో కలసి తీవ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. హెల్మండ్ ప్రావెన్స్ తాలిబన్లకు అత్యంత అనుకూలమైన ప్రాంతమని భద్రత దళ ఉన్నతాధికారి తెలిపారు. అయితే తీవ్రవాదులపై భద్రత దళాల దాడిపై తాలిబన్లు ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.