తమ గ్రూప్ సభ్యులను మట్టుపెట్టారన్న ఉద్దేశ్యంతో ఉగ్రవాదులు ప్రతీకార దాడికి పాల్పడ్డారు.
మిలిటెంట్ల కౌంటర్ ఎటాక్.. 13 మంది మృతి
Aug 28 2017 10:24 AM | Updated on Nov 6 2018 8:35 PM
నవా(అఫ్ఘనిస్థాన్): ఉగ్రవాద ప్రతీకార దాడితో అఫ్ఘనిస్థాన్ దక్షిణ హెల్మండ్ ప్రాంతం నెత్తురొడింది. ఆదివారం సాయంత్రం నవా జిల్లాలో జరిగిన ఉగ్రవాద ఆత్మాహుతి దాడిలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారు.
దోపుల్ ప్రాంతంలో వాహనంలో వచ్చిన ఓ ఉగ్రవాది మానవ బాంబుగా మారి పేల్చుకోవటంతో ఈ దారుణం చోటు చేసుకుంది. తొలుత ఇద్దరు మాత్రమే చనిపోయారని అధికారులు ప్రకటించినప్పటికీ ఆ సంఖ్య ఇప్పుడు 13కు చేరింది. చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని చెబుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా, రెండు రోజుల క్రితం అఫ్ఘనిస్థాన్, విదేశీ సైన్యాలు సంయుక్తంగా హెల్మండ్ ప్రాంతంలో వైమానిక దాడులు నిర్వహించి 21 మంది తాలిబన్ మిలిటెంట్లను మట్టుపెట్టాయి. ఈ నేపథ్యంలో సైన్యమే లక్ష్యంగా తాలిబన్ గ్రూప్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది.
Advertisement
Advertisement