ఒడిశాలో 10 మంది మావోయిస్టులు లొంగుబాటు | 10 Maoists surrender in Odisha | Sakshi
Sakshi News home page

ఒడిశాలో 10 మంది మావోయిస్టులు లొంగుబాటు

Oct 30 2013 3:33 PM | Updated on Oct 9 2018 2:40 PM

ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా పోలీసు ఎస్పీ ఎదుట 10 మంది మావోయిస్టులు బుధవారం లొంగిపోయారు.

ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా పోలీసు ఎస్పీ ఎదుట 10 మంది మావోయిస్టులు బుధవారం లొంగిపోయారు. ఆ మావోయిస్టుల్లోని ఐదుగురిపై మందుపాతర పేలుళ్లు, పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు దొంగతనం తదితర కేసుల్లో వారంత నిందితులని పోలీసు ఉన్నతాధికారి బుధవారం వెల్లడించారు.

 

మరో మావోయిస్టు లోకల్ ఏరియా దళ కమాండర్గా పని చేస్తున్నారని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారని చెప్పారు. వారంతా 21 నుంచి 30 ఏళ్ల వయస్సు కలవారని చెప్పారు. లొంగిపోయన మావోయిస్టులకు ప్రభుత్వం కల్పించే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పోలీసు ఉన్నతాధికారి ఈ సందర్భంగా వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement