అవెంజర్స్‌తో జతకట్టిన భళ్లాల దేవ

Rana Daggubati Dubbing For Avengers Infinity War - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హాలీవుడ్‌ సినిమాలో మన తెలుగు నటుడా అని​ ఆశ్చర్యపోకండి. రానా దగ్గుబాటి హాలీవుడ్‌లో జతకట్టింది నటనతో కాదు..సినిమాలో ఓ పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం ద్వారా ఆ రూట్‌లో ఎంట్రీ ఇచ్చారు. అవెంజర్స్‌ సిరీస్‌లోనే భారీ అంచనాలతో విడుదల కాబోతున్న చిత్రం అవెంజర్స్‌ ఇన్ఫినిటీ వార్‌. ఈ సినిమాలో హీరోలను ఢీ కొట్టే సింగిల్‌మన్‌ ఆర్మీ.. అదే విలన్‌ తానోస్‌ పాత్రకు డబ్బింగ్‌ చెప్పారట రానా. మరో సారి  భళ్లాలదేవ విలనిజాన్ని తెర మీద వినబోతున్నారు ప్రేక్షకులు. రానా మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి మార్వెల్‌ కామిక్స్ చదువుతూ‌, సినిమాలు చూస్తూ పెరిగానన్నారు.

మార్వెల్‌ సంస్థ ఎవ్వరూ ఊహించని విధంగా మంచి కథలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరిస్తోందన్నారు. ఐరన్‌ మాన్‌, కెప్టెన్‌ అమెరికా నచ్చిన పాత్రలని ఆయన తెలిపారు. ఈ సినిమాలో విలన్‌ తానో పాత్రకు డబ్బింగ్‌ చెప్పటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో రానా డబ్బింగ్‌ చెప్పినట్లు గానే ఇతర భాషల్లో కూడా అక్కడి నటీనటులతో డబ్బింగ్‌ చెప్పిస్తున్నారు నిర్మాతలు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top