
అనంతపురం, గుత్తి : పట్టణంలోని ఎస్సీకాలనీ, కోట ప్రాం తంలో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘లవర్’ సినిమా షూటింగ్ గురువారం జరిగింది. హీరో రాజ్‌తరుణ్‌పై పలు సన్నివేశాలు చిత్రీకరించారు. హీరోకు, విలన్, రౌడీలకు మధ్య ఫైట్ సన్నివేశాన్ని షూట్ చేశారు. దర్శకుడిగా నితిష్, నిర్మాతగా దిల్ రాజు, కెమెరా మెన్‌గా సమీరా రెడ్డి వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల పాటు గుత్తిలోనే షూటింగ్ జరుగనుంది. గుత్తికి చెందిన వర్ధమాన సినీ హీరో సి. విజయభాస్కర్, గిల్లీ దండా (ఫేమ్) విలన్ శ్రీకరం నరేష్‌రాయల్, నటుడు హేమంత్ రాయల్ హీరో తరుణ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.