
అలంకృత సహాయ్ ,కాజల్ అగర్వాల్
ఎరుపు డ్రెస్సుల్లోమెరిసిపోయారు హీరోయిన్ కాజల్ అగర్వాల్, వర్ధమాన తార అలంకృత సహాయ్. గురువారం నగరంలో ఓ బ్యూటీ ప్రొడక్ట్ లాంచింగ్‌లో కాజల్, ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ‘సూత్ర’లో అలంకృత సందడి చేశారు.
సోమాజిగూడ: ‘సాధారణంగా నేను బద్ధకస్తురాలిని. సాధారణ పరిస్థితుల్లో పెద్దగా అలంకరించుకునే అలవాటు లేదు. వాతావరణ పరిస్థితులు, సందర్భానికి అనుగుణంగా తయారయ్యేందుకుఇష్టపడతాన’ని చెప్పింది నటి కాజల్ అగర్వాల్. సౌందర్యఉత్పత్తుల సంస్థ పాండ్స్ సరికొత్త ప్రొడక్ట్ ‘పాండ్స్ స్టార్‌లైట్ పెర్‌ఫ్యూమ్ టాల్క్ పౌడర్’ను రాజ్‌భవన్ రోడ్‌లోని పార్క్ హోటల్‌లో ఆమె గురువారం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిచ్చి సందడి చేసింది.