జోన్ల లొల్లి.. వికారాబాద్ బంద్‌

Zones Alligations Vikarabad Bandh - Sakshi

సాక్షి, వికారాబాద్ : తమ జిల్లాను జోగులాంబ జోన్‌లో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం వికారాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు బంద్‌ చేపట్టారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి బస్ డిపో ముందు బైఠాయించడంతో బస్సులు డిపొకే పరిమితమయ్యాయి. వివిధ రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు 

జిల్లా బంద్‌లో పాల్గొన్నాయి. కాగా, జోన్ల విషయంలో సీఎం కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని, దీనిపై కాంగ్రెస్‌ తరపున కేంద్రానికి లేఖ రాస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. 

వికారాబాద్ జిల్లాను పక్కనే ఉన్నచార్మినార్ జోన్లో కాకుండా ఎక్కడో సుదూరంలో ఉన్న జోగులాంబలో కలపడంపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. ఎక్కడో దూరంలో ఉన్న జహీరాబాద్‌ ప్రాంతాన్నే చార్మినార్‌ జోన్లో కలపగా, పక్కనే ఉన్న వికారాబాద్‌ను మాత్రం జోగులాంబ జోన్ల కలపడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇక్కడి వారు అక్కడికెళ్లి ఉద్యోగాలు చేయడమంటే జిల్లా అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. 

అధికార పార్టీ ఎమ్మెల్యేలైన యాదయ్య, సంజీవరావు తదితర నేతలు సైతం సీఎం కేసీఆర్‌ను ఒప్పించే విషయంలో విఫలమయ్యారని జిల్లా వాసులు మండిపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ నిర్ణయం టీఆర్‌ఎస్‌కు జిల్లాలో సెల్ఫ్‌గోల్‌గా మారింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top