ఏం సాధించారని టీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు.
'ఏం సాధించారని సంబరాలు'
Mar 9 2016 1:44 PM | Updated on May 29 2018 4:26 PM
కరీంనగర్: ఏం సాధించారని టీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి పేరు వస్తుందనే అక్కసుతో రీ డిజైనింగ్ పేరుతో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుతో ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి నీళ్లు తరలించేందుకు ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. రీడిజైన్ తో ఎన్ని ఎకరాలకు నీరు అందిస్తారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement