పత్తి మద్దతు ధర కోసం వైఎస్‌ఆర్సీపీ ధర్నా | ysrcp dharna for cotton support price in telangana | Sakshi
Sakshi News home page

పత్తి మద్దతు ధర కోసం వైఎస్‌ఆర్సీపీ ధర్నా

Oct 30 2017 3:21 PM | Updated on May 29 2018 4:40 PM

పత్తికి మద్దతు ధర ప్రకటించాలని కరీంనగర్‌ మార్కెట్ యార్డు వద్ద వైఎస్సార్‌పీసీపీ ఆందోళన చేపట్టింది.

సాక్షి, కరీంనగర్‌: పత్తికి మద్దతు ధర ప్రకటించాలని కరీంనగర్‌ మార్కెట్ యార్డు వద్ద వైఎస్సార్‌పీసీపీ ఆందోళన చేపట్టింది. సోమవారం వైఎస్‌ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి శ్రేణులతో కలిసి మార్కెట్‌ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా పత్తి కొనుగోళ్లను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. సీసీఐతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని మార్కెట్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. పత్తి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి ఇచ్చే రూ.4,000 ఇప్పటి నుంచే ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే పత్తి రైతుల పక్షాన ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement