ముగిసిన షర్మిల పరామర్శ యాత్ర | ys sharmila paramarsha yatra in rangareddy district | Sakshi
Sakshi News home page

ముగిసిన షర్మిల పరామర్శ యాత్ర

Jul 2 2015 3:25 PM | Updated on Mar 28 2018 11:08 AM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను ఓదార్చడానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల జిల్లాలో చేపట్టిన పరామర్శయాత్ర ముగిసింది.

రంగారెడ్డి:దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను ఓదార్చడానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల జిల్లాలో చేపట్టిన పరామర్శయాత్ర ముగిసింది. చివరిరోజు పరామర్శయాత్రలో భాగంగా గురువారం మధ్యాహ్నం మోమినపేటకు చేరుకున్న షర్మిల.. తొలుత అరిగె యాదయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం ఎల్కతలలోని ఆలంపల్లి వెంకటేశ్ కుటుంబాన్నిషర్మిల పరామర్శించారు.

 

నాలుగు రోజుల పాటు 590 కిలోమీటర్ల మేర షర్మిల పరామర్శయాత్ర సాగింది.  ఏడు నియోజకవర్గాల్లో 15 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. గత నెల 29 వ తేదీన వైఎస్ షర్మిల జిల్లాలో  మలివిడత పరామర్శయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement