జగన్‌కు ఘన స్వాగతం | ys Jagan to Grand welcome at Ghatkesar | Sakshi
Sakshi News home page

జగన్‌కు ఘన స్వాగతం

Jan 13 2015 3:03 AM | Updated on Jul 25 2018 4:09 PM

జగన్‌కు ఘన స్వాగతం - Sakshi

జగన్‌కు ఘన స్వాగతం

వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి ఘట్‌కేసర్ మండలం జోడిమెట్ల వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

ఘట్‌కేసర్: వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి ఘట్‌కేసర్ మండలం జోడిమెట్ల వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సోమవారం వైఎస్ జగన్ వరంగల్ జిల్లాలో సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తూ మార్గమధ్యంలో జోడిమెట్ల వద్ద కొద్దిసేపు ఆగి కార్యకర్తలు, నాయకులతో చరచాలనం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి రాక సందర్భంగా పార్టీ శ్రేణులు బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. గం.10.30 సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్ జోడిమెట్లకు చేరుకోవడంతో కార్యకర్తలు ‘జై జగన్, జైజై జగన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. పూలదండలు వేసి పుష్ఫగుచ్ఛాలు అందచేశారు. జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లిపోయిన అనంతరం స్థానిక నాయకులు సుధీర్‌రెడ్డి చిత్ర పటానికి నివాళి అర్పించారు.

కార్యక్రమంలో ఆ పార్టీ మేడ్చల్ నియోజవర్గ నాయకుడు సామల యాదిరెడ్డి, రవీందర్‌రెడ్డి, పెరుమాళ్ల అశోక్, మహేష్, రాజు, సంజీవరెడ్డి, కట్ట సంజీవరెడ్డి, సంజీవరెడ్డి, జైపాల్‌రెడ్డి, పోచారం గ్రామశాఖ అధ్యక్షుడు రమేష్ గుప్త, సురేందర్, సుందర్, కొండయ్య, విజయ్, నాగేష్, మురళీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement