యువతకు అండగా కాంగ్రెస్‌ 

 Young People Join In The Congress - Sakshi

డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌

యాదగిరిగుట్ట : యువతకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందని  ఏఐసీసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌ అన్నారు. యాదగిరిగుట్ట మండలం బాహుపేటలో వివిధ పార్టీలకు చెందిన యువకులు ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో  చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  యువతను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ ముందుంటుందన్నారు. యువనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు, నిరుద్యోగ భృతిని అందించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఇమ్మడి మాధవిరాంరెడ్డి, కాంగ్రెస్‌ బీసీ సెల్‌ జిల్లా ఉపాధ్యాక్షుడు చీర శ్రీశైలం, పార్టీ మండల అధ్యక్షుడు బీర్ల అయిలయ్య, పాలసంఘం చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, యాదాద్రి దేవస్థానం మాజీ ధర్మకర్త పెల్లిమెల్లి శ్రీధర్‌గౌడ్, మండల వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కానుగు బాలరాజు, గ్రామశాఖ అధ్యక్షులు శంకర్, ప్రభాకర్‌ తదితరులున్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top