యాదాద్రి' పైలాన్ వద్ద ఉద్రిక్తత | yadaadri pilan works disturbes project land victims | Sakshi
Sakshi News home page

యాదాద్రి' పైలాన్ వద్ద ఉద్రిక్తత

May 6 2015 11:26 AM | Updated on Sep 3 2017 1:33 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు సంబంధించి సేకరించిన రైతుల భూములకు ఎంత ధర నిర్ధారించారో స్పష్టంచేయాలని బాధితులు ఆందోళనకు దిగారు.

నల్గొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు సంబంధించి సేకరించిన రైతుల భూములకు ఎంత ధర నిర్ధారించారో స్పష్టంచేయాలని బాధితులు ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం గ్రామాలకు చెందిన రైతులు.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ నాయకులు కలిసి బుధవారం థర్మల్ విద్యుత్ ప్లాంట్ కు చేరుకొని పైలాన్ నిర్మాణం కోసం జరుగుతున్న ఏర్పాట్లను ధ్వంసం చేశారు. పైలాన్ కోసం తీసిన గుంటలను కప్పేయడంతో పాటు.. ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం కోసం తీసుకున్న భూములకు నష్టపరిహారం ఎంత ఇస్తారో స్పష్టం చేయాలని.. విద్యుత్ కేంద్రంలో స్థానికులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement