తాగు నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ దుబ్బాక నగర పంచాయతీ పరిధిలోని ధర్మాజీపేట ఏడవ వార్డు మహిళలు మంగళవారం నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
	దుబ్బాక (మెదక్ జిల్లా) : తాగు నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ దుబ్బాక నగర పంచాయతీ పరిధిలోని ధర్మాజీపేట ఏడవ వార్డు మహిళలు మంగళవారం నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. గత ఆరు నెలల నుంచి తమ వార్డుకు తాగు నీటిని సరఫరా చేయడంలో నగర పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
	
	మూడు గజాల లోతు నల్లా గుంతలు తీసినా చుక్క నీరు రావడం లేదన్నారు. తమ వార్డులోకి తాగు నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మహిళలు డిమాండ్ చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
