ప్రేమించి పెళ్లి చేసుకొని.. | women protest at husband home in yadadri district | Sakshi
Sakshi News home page

ప్రేమించి పెళ్లి చేసుకొని..

Jun 24 2017 2:12 PM | Updated on Sep 5 2017 2:22 PM

ప్రేమించి పెళ్లి చేసుకొని.. నాలుగేళ్లు కాపురం చేసి ఇప్పుడు తనను వద్దంటున్నాడని ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది.

వలిగొండ: ప్రేమించి పెళ్లి చేసుకొని.. నాలుగేళ్లు కాపురం చేసి ఇప్పుడు తనను వద్దంటున్నాడని ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో శనివారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన పలుసం లింగస్వామి, కొరబోయిన జ్యోతి నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాలు వేరుకావడంతో వారి ప్రేమకు పెద్దలు నిరాకరించడంతో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు.
 
అప్పటి నుంచి హైదరాబాద్‌లో నివాసముంటున్న వీరి మధ్య గత కొన్నిరోజులుగా గొడవలు జరగుతున్నాయి. ఈ క్రమంలో 'నువ్వు నా భార్యవే కాదు.. నీకు నాకు సంబధం లేదు' అని అంటుండటంతో మనస్తాపానికి గురైన యువతి ఈ రోజు నాతాళ్లగూడెంలో భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఆమెకు వివిధ ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు మద్దతు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement