మహిళా రైతు ఆత్మహత్య | women farmer suicide in karimnagar distirict | Sakshi
Sakshi News home page

మహిళా రైతు ఆత్మహత్య

Oct 6 2015 10:32 AM | Updated on Nov 6 2018 7:56 PM

కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం నర్సక్కపేటలో జోగు పోచవ్వ(47) అనే మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం నర్సక్కపేటలో జోగు పోచవ్వ(47) అనే మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోచవ్వ ఇటీవల తనకున్న ఐదు ఎకరాలలో పత్తిపంట వేసింది. వేసిన పంట సరైన వర్షాలు లేకపోవడంతో ఎండిపోయింది. చేసిన అప్పులు తీర్చడానికి ఇటీవల ఒకటిన్నర ఎకరం పొలాన్ని అమ్మింది. అయినా అప్పులు తీరకపోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement