మద్యం మత్తులో విద్యార్థిని వేధించిన మహిళా వార్డెన్ | woman warden harrassing girl student | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో విద్యార్థిని వేధించిన మహిళా వార్డెన్

Mar 3 2015 9:06 PM | Updated on Sep 4 2018 5:16 PM

బాధ్యత మరిచిన ఓ మహిళా వార్డెన్ మద్యం మత్తులో ఓ విద్యార్థినిని వేధించిన ఘటన మెదక్ జిల్లా నారాయణఖేడ్ బాలల సదనంలో వెలుగు చూసింది.

నారాయణఖేడ్ (మెదక్): బాధ్యత మరిచిన ఓ మహిళా వార్డెన్ మద్యం మత్తులో ఓ విద్యార్థినిని వేధించిన ఘటన మెదక్ జిల్లా నారాయణఖేడ్ బాలల సదనంలో వెలుగు చూసింది. పోలీసులు, విద్యార్థినుల కథనం ప్రకారం... మనూర్ మండలం ముగ్ధంపూర్ గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని నారాయణఖేడ్‌లోని మహిళావృద్ధి, శిశు సంక్షేమ శాఖకు చెందిన బాలల సదనంలో ఉంటూ 9వ తరగతి చదువుతోంది. ఇక్కడి వసతిగృహం వార్డెన్‌గా పనిచేస్తున్న చంద్రకళ తన భర్త జగదీశ్వర్, ముగ్ధంపూర్ గ్రామానికి చెందిన రామకృష్ణ అనే మరో వ్యక్తితో కలసి వసతి గృహానికి వచ్చి అక్కడే మద్యం తీసుకోవడం మూడు నెలలుగా జరుగుతోంది.

 

మద్యం మత్తులో రామకృష్ణను పెళ్లి చేసుకోవాలంటూ వార్డెన్ చంద్రకళ సదరు విద్యార్థిని వేధిస్తోంది. దీనిపై విద్యార్థినులు ఏఐఎస్‌ఎఫ్ నాయకులకు తెలుపడంతో వారు మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి బాధిత విద్యార్థిని నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement