భర్త ఇంటి వద్ద భార్య పడిగాపులు | Wife Protest infront of Husband House in Khammam | Sakshi
Sakshi News home page

భర్త ఇంటి వద్ద భార్య పడిగాపులు

Jun 27 2020 12:13 PM | Updated on Jun 27 2020 12:13 PM

Wife Protest infront of Husband House in Khammam - Sakshi

అత్తారింట్లో కుమారుడు, తల్లిదండ్రులతో కలిసి పడిగాపులు కాస్తున్న ప్రియాంక

రఘునాథపాలెం: భర్త తనను పుట్టింట్లో వదిలేసి 6 నెలలవుతుందని, తనను, తన ఏడాది కుమారుడిని తిరిగి ఇంటికి తీసుకెళ్లాలని కోరుతూ ఓ వివాహిత గత మూడు రోజులుగా భర్త ఇంటి వద్ద పడిగాపులు కాస్తోంది. దీనికి సంబంధించి బాధితురాలు ప్రియాంక తెలి పిన వివరాల ప్రకారం.. మండలంలోని జింకలతండాకు చెందిన ఓ యువకుడు జైళ్లశాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నా డు. ఆ యువకుడికి గత రెండు సంవత్సరాల క్రితం కారేపల్లి మండలం పాటివారి గుంపునకు చెందిన ప్రియాంకతో వివాహం జరిగింది. కట్నంగా రూ.10 లక్షల విలు వ చేసే బంగారం, రూ.20 లక్షల నగదు ఇచ్చారు. వారికి ప్రస్తుతం ఏడాది బాబు ఉన్నాడు.

ఆరు నెలలు క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో తనను పుట్టింటి వద్ద వదిలి వెళ్లాడు. తర్వాత తీసుకుపోవడానికి రాకపోవడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించడంతో పాటు కారేపల్లి పోలీసు స్టేషన్‌లో సైతం కౌన్సెలింగ్‌ నిర్వహించారని ప్రియాంక తెలిపింది. అప్పుడు 10 రోజుల్లో తీసుకెళ్తానని చెప్పిన భర్త ఎంతకూ తీసుకెళ్లకపోవడంతో భర్త స్వగ్రామమైన జింకల తండాకు గత మూడు రోజులు క్రితం తన తల్లిదండ్రులతో వచ్చింది. తాము రాగానే అత్తామామలు ఇంటికి తాళం వేసి వెళ్లారని, నాటి నుంచి తాము ఇంటిముందు వరండాలోనే పడిగాపులు కాస్తున్నట్లు తెలిపింది. తనకు, బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. ఈ విషయమై రఘునాథపాలెం ఎస్సై సంతోష్‌ను వివరణ కోరగా తమకు మాత్రం ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement