భూముల అమ్మకం తప్ప స్వైన్‌ఫ్లూను పట్టించుకోరా? | why do not care about swine flu in telangana ? | Sakshi
Sakshi News home page

భూముల అమ్మకం తప్ప స్వైన్‌ఫ్లూను పట్టించుకోరా?

Jan 23 2015 12:43 AM | Updated on Sep 2 2017 8:05 PM

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రభుత్వ భూముల అమ్మకంపై ఉన్న శ్రద్ధ స్వైన్‌ఫ్లూను అరికట్టడంలో లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు.

* సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి ప్రశ్న
* అడిగిన వెంటనే కేంద్రం స్పందించింది: కేంద్రమంత్రి దత్తాత్రేయ  
 
 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రభుత్వ భూముల అమ్మకంపై ఉన్న శ్రద్ధ స్వైన్‌ఫ్లూను అరికట్టడంలో లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. గురువారం కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ,  రోజుకో కొత్త హామీ ఇచ్చి, పాత హామీలను అమలుచేయకుండా రాష్ర్ట ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు.
 
 విద్యార్థులకు ఫీజు రీయింబర్‌‌సమెంటును అమలు చేయడంలేదని అన్నారు. ప్రభుత్వానికి పాలనపై పట్టులేదన్నారు.  భూములను అమ్మాలనే ఆలోచన తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలపై శ్రద్ధ పెట్టడం లేదన్నారు. దత్తాత్రేయ మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి, నిపుణుల బృందాన్ని పంపిందన్నారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం రూపొందించిన డైరీని కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. పార్టీ మేధావుల సంఘం చైర్మన్ దినేశ్‌రెడ్డి, పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి పరమేశ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement