తెల్లకార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ‘కల్యాణలక్ష్మి’ | White card everyone "kalyanalaksmi 'scheme | Sakshi
Sakshi News home page

తెల్లకార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ‘కల్యాణలక్ష్మి’

Mar 29 2016 1:46 AM | Updated on Oct 30 2018 8:01 PM

తెల్లకార్డు ఉన్న  ప్రతి ఒక్కరికీ ‘కల్యాణలక్ష్మి’ - Sakshi

తెల్లకార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ‘కల్యాణలక్ష్మి’

అన్ని వర్గాల అభివృద్ధే టీఆర్‌ఎస్ లక్ష్యమని తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ కల్యాణలక్ష్మి ....

 జెడ్పీ చైర్మన్ బండారిభాస్కర్

 జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): అన్ని వర్గాల అభివృద్ధే టీఆర్‌ఎస్ లక్ష్యమని తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ కల్యాణలక్ష్మి అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ అన్నా రు. సోమవారం తన చంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అగ్రకులాల్లో ఉండి తెల్లరేషన్ కార్డు ఉన్నవారికీ ఈ పథకం అమలవుతుంద సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినట్లు చెప్పారు.

అందులో భాగంగానే జిల్లాకు రూ.35 వేల కోట్లతో పెద్ద ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతలను నిర్మించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో జిల్లాలో సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వర్షాభావం కారణంగా నెలకొన్న నీటి కొరతను తీర్చేందుకు ముందస్తు చర్యలు చేపట్టనున్నుట్లు తెలిపారు. రైతులకు పగడి పూట 9 గంటల నిరంతరం విద్యుత్‌ను సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement