అధికారమే లేనప్పుడు ఆధిపత్య పోరెక్కడిది?: జానా | Where in the absence of authority, domination?: Jana | Sakshi
Sakshi News home page

అధికారమే లేనప్పుడు ఆధిపత్య పోరెక్కడిది?: జానా

Jul 17 2014 1:32 AM | Updated on Mar 18 2019 9:02 PM

అధికారమే లేనప్పుడు ఆధిపత్య పోరెక్కడిది?: జానా - Sakshi

అధికారమే లేనప్పుడు ఆధిపత్య పోరెక్కడిది?: జానా

వచ్చే నెల 4న పార్టీ ఎమ్మెల్యేలు, ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులతో ఏర్పాటు చేయనున్న సమావేశం ఆధిపత్య ప్రదర్శన కోసం కాదని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్:  వచ్చే నెల 4న పార్టీ ఎమ్మెల్యేలు, ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులతో ఏర్పాటు చేయనున్న సమావేశం ఆధిపత్య ప్రదర్శన కోసం కాదని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేనప్పుడు ఆధిపత్య పోరెక్కడిదని ప్రశ్నించారు. తాను సీఎల్పీ నేతగా ఎన్నికైన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాన్నారు.

పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో విభేదాలున్నాయన్నది అపోహ మాత్రమేనని పేర్కొన్నారు. పొన్నాల ప్రమేయం లేకుండా ఈ సమావేశం జరుగనుందని పత్రికల్లో వచ్చిన కథనాలపై  బుధవారం జానారెడ్డి స్పందించారు. మాజీ మంత్రులు డీకే అరుణ, టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిలతో కలిసి ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. సమావేశానికి పొన్నాలే ముఖ్యఅతిథి అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement