కామన్‌ మెస్‌ తెరుచుకునేదెప్పుడో | When Will The Common Mess Is Open | Sakshi
Sakshi News home page

కామన్‌ మెస్‌ తెరుచుకునేదెప్పుడో

Jul 16 2018 2:52 PM | Updated on Jul 16 2018 2:52 PM

When Will The Common Mess Is Open - Sakshi

కామన్‌మెస్‌

కేయూ క్యాంపస్‌ : కాకతీయ విశ్వవిద్యాలయంలో వేసవి సెలవుల అనంతరం పీజీ కోర్సులు మూడో సెమిస్టర్‌  తరగతులు ప్రారంభమై 20 రోజులైనా నేటికి  కామన్‌ మెస్‌ తెరుచుకోలేదు. జూన్‌ 26 నుంచి తరగతులు ప్రారంభమైనా విద్యార్థులు ఇప్పటికీ మెస్‌కార్డులు రెన్యూవల్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. గత విద్యా సంవత్సరం మెస్‌ బకాయిలు చెల్లించిన తర్వాతే మెస్‌ కార్డులు రెన్యూవల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఒక్కో విద్యార్థికి స్కాలర్‌షిప్‌లు పోను రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు బకాయిలు చెల్లించాల్సింటుంది. 60 బకాయిలు చెల్లించినా మెస్‌ కార్డు రెన్యూవల్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 40 మంది విద్యార్థులు మాత్రమే రెన్యూవల్‌ చేసుకున్నారు. కనీసం వంద మంది విద్యార్థులైనా కార్డులు రెన్యూవల్‌ చేసుకుంటే తప్ప మెస్‌ ఓపెన్‌ చేయరు. గత నెల 26 నుంచే ఇంజినీరింగ్‌ విద్యార్థులకు మెస్‌  ప్రారంభమైంది.

లేడీస్‌ హాస్టల్‌ సైతం ఓపెన్‌ చేశారు. కామన్‌ మెస్‌లో వేయి మందికిపైగా మెస్‌కార్డులు తీసుకునే వీలున్నా 40 మంది వరకే రెన్యూవల్‌ చేసుకున్నారు. మూడో సెమిస్టర్‌ తరగతులు ప్రారంభమైనా విద్యార్థులు హాజరు కావడం లేదు. విద్యార్థులకు 75 శాతం మేర హాజరు శాతం తప్పని సరి అనే నిబంధన ఉన్నా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో విద్యార్థులు తరగతులు కూడా హాజరు కావడంలేదు. 

తెరుచుకోని పోతన హాస్టల్‌  

విద్యార్థులు మెస్‌కార్డులు రెన్యూవల్‌ చేసుకుంటే వారికి మొదటగా పోతన హాస్టల్‌ను కేటాయిస్తారు. విద్యార్థులు రాకపోవటంతో పోతన హాస్టల్‌ను సైతం  ఇప్పటవరకు ఓపెన్‌ చేయలేదు. ఈ సారి హాస్టళ్లో నాన్‌బోర్డర్లు లేకుండా చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. మెస్‌కార్డులు రెన్యూవల్‌ చేసుకున్న వారికే రూమ్‌లు కేటాయించే యోచనలో ఉన్నారు.

పోతన హాస్టల్‌ పూర్తయిన తర్వాతే జగ్జీవన్, అంబేద్కర్, ఓల్డ్‌ ఫార్మసీ, జీడి 2, జీడీ 3లలో హాస్టల్‌ వసతి కల్పిస్తారు. పీజీ కోర్సుల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. అడ్మిషన్లు పూర్తి కాగానే హాస్టల్‌ వసతి మెస్‌ సౌకర్యం కల్పించాలనే యోచనలో హాస్టల్‌ అధికారులు ఉన్నారు. త్వరగా మెస్‌ సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement