జేసీబీ డోజర్‌లో వధూవరుల బరాత్‌  | Wedding reception in Jcb Doser | Sakshi
Sakshi News home page

జేసీబీ డోజర్‌లో వధూవరుల బరాత్‌ 

May 10 2019 1:38 AM | Updated on May 10 2019 9:34 AM

Wedding reception in Jcb Doser - Sakshi

సంగెం (పరకాల): సాధారణంగా పెళ్లి పూర్తయ్యాక వధూ వరులతో కారు లేదా జీపు.. ఇంకా ఆసక్తి ఉంటే గుర్రాల బగ్గీపై బరాత్‌ నిర్వహించడం ఆనవాయితీ. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం తనకు బతుకుదెరువు ఇచ్చిన జేసీబీపైనే బరాత్‌ ఏర్పాటు చేసుకున్నాడు. వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురానికి చెందిన ఉడుతబోయిన రాకేష్‌ చిన్నప్పటి నుంచి వాహనాలను ఇష్టపడేవాడు.

తండ్రితో కలసి స్వయం ఉపాధి కోసం జేసీబీ తీసు కుని నడుపుకుంటున్నాడు. ఇదే మండలంలోని లోహిత గ్రామానికి చెందిన సుప్రియతో ఈనెల 8న రాకేష్‌ వివా హం జరిగింది. ఇందులో భాగంగా బుధవారం రాత్రి తన జేసీబీ డోజర్‌ను అందంగా అలంకరించి దాని తొట్టెలో సుప్రియతో కలసి కూర్చుని బరాత్‌ నిర్వహించుకున్నాడు. దీనికి గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement