పంచాయతీ ఎన్నికల్లో అపశ్రుతి

VRO Dies in Telangana Panchayat Election Duty Kodangal - Sakshi

గుండెపోటుతో వీఆర్‌ఓ ఆకస్మిక మృతి

కోస్గి (కొడంగల్‌): మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న ఓ వీఆర్‌ఓ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంఘటన మండలంలోని ముశ్రీఫాలో బుధవారం చోటుచేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. మండలంలోని ముశ్రీఫా వీఆర్‌ఓగా పనిచేస్తున్న నర్సప్ప(48) ఎన్నికల విధుల్లో భాగంగా ఇదే పంచాయతీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఎన్నికలు ప్రారంభమై ప్రశాంతంగానే కొనసాగుతున్న తరుణంలో నర్సప్పకు ఒక్కసారిగా కళ్లు తిరుగుతూ చెమటలు పట్టడంతో గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీ దగ్గరకు వెళ్లారు.

బీపీ ఎక్కువగా ఉందని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించగా ఆటోలో కోస్గికి వస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే కుప్పకూలిపోయారు. స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఆస్పతికి తీసుకురాగా అప్పటికే మృతిచెందినట్లు వైధ్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న నారాయణపేట ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్‌ బుచ్చయ్య, రెవెన్యూ అధికారులు సిబ్బంది ఆస్పత్రికి చేరుకొని నర్సప్ప కుటంబ సభ్యులను పరామర్శించారు. కాగా నర్సప్ప స్వగ్రామం దౌల్తాబాద్‌ మండలం చంద్రకల్‌ కాగా, ఆయనకు భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top