అందుబాటులో ఉంటా.. ఆశీర్వదించండి | Vote For Me: Maloth Kavitha | Sakshi
Sakshi News home page

అందుబాటులో ఉంటా.. ఆశీర్వదించండి

Apr 8 2019 5:08 PM | Updated on Apr 8 2019 5:08 PM

Vote For Me: Maloth Kavitha - Sakshi

రోడ్‌షోలో బోనాలు ఎత్తుకుని ప్రజలకు అభివాదం చేస్తున్న ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత, ఎమ్మెల్యే హరిప్రియ, ఇన్‌చార్జ్‌ సత్యవతి

ఇల్లెందు: నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించటమే తన చిరకాల కోరికని, ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవటం కోసమే మీ ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించాలని మహబూబాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి  మాలోతు కవిత కోరారు. ఆదివారం రాత్రి ఇల్లెందులోని కరెంటాఫీఎస్‌ నుంచి గోవింద్‌ సెంటర్‌ మీదుగా కొత్త బస్టాండ్‌ సెంటర్‌ వరకు ర్యాలీ, రోడ్‌ షో నిర్వహించారు. ఈ రోడ్‌షోలో ఎంపీ అభ్యర్థి కవితతో పాటు ఎమ్మెల్సీ, పార్లమెంటు ఇన్‌చార్జ్‌ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య, నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్, జీసీసీ చైర్మన్‌ మోహన్‌గాంధీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ దిండిగల రాజేందర్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మడత రమలు ప్రజలకు అభివాదం చేశారు.

ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు తన సేవలు అందించాలనే తన చిరకాల కోరిక ఈ విధంగా తీరనుందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష మేరకు పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలని వేడుకున్నారు. ఇక్కడి అన్ని వర్గాలు, గ్రూపుల సహకారం తీసుకుంటానని, అందరిని కలుపుకుని ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. బయ్యారంలో స్టీల్‌ పరిశ్రమ ఏర్పాటు, సీతారామా ప్రాజెక్టు నిర్మాణం, ఇల్లెందు రైలు సమస్యలతో పాటు బస్‌డిపో ఏర్పాటు లాంటి సమస్యలు తీరాలంటే టీఆర్‌ఎస్‌ ఎంపీ ఉంటేనే సాధ్యం అవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో కో ఆప్షన్‌ సభ్యుడు మడత వెంకట్‌గౌడ్, దమ్మాలపాటి వెంకటేశ్వర రావు, పరుచూరి వెంకటేశ్వరరావు, కొక్కు నాగేశ్వరరావు, బానోతు హరిసింగ్‌ నాయక్, అక్కిరాజు గణేష్, లకావత్‌ దేవీలాల్‌ నాయక్, కనగాల పేరయ్య, సుధీర్‌తోత్లా, మండల రాము, బోళ్ల సూర్యం, సూర్నబాక సత్యనారాయణ, బి. లాల్‌ సింగ్‌ నాయక్, భావ్‌సింగ్‌ నాయక్, బానోతు స్వామినాయక్, తోటలలిత శారధ, కొక్కు సరిత తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement