విమానాశ్రయంలో వీడియోవాల్స్ | video walls in rajiv gandhi airport | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో వీడియోవాల్స్

Oct 6 2014 1:24 AM | Updated on Sep 4 2018 5:15 PM

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 4 వీడియో వాల్స్ ఏర్పాటు చేశారు.

సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 4 వీడియో వాల్స్ ఏర్పాటు చేశారు. విమానాశ్రయంలోని జాతీయ, అంతర్జాతీయ టెర్మినళ్లలో నాలుగు వీడియో వాల్స్‌కు అత్యాధునిక పన్నెండు స్క్రీన్‌లను ఏర్పాటు చేసినట్టు విమానాశ్రయ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు, వారి కుటుంబసభ్యులు వీటిల్లో టీవీ కార్యక్రమాలను వీక్షించడానికి అవకాశం ఉందన్నారు. వీటితోపాటు ఆటోమోటెడ్ వాయిస్ అనౌన్స్‌మెంట్‌ను కూడా నూతనంగా ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇందులో విమానాలకు సంబంధించిన సమాచారం, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తారన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement