ఎన్టీఆర్ పేరు తొలగించాలి.. లేకుంటే... | VH demands Remove ntr name shamshabad airport domestic terminal | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ పేరు తొలగించాలి.. లేకుంటే...

Published Sun, Nov 30 2014 1:28 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ఎన్టీఆర్ పేరు తొలగించాలి.. లేకుంటే... - Sakshi

ఎన్టీఆర్ పేరు తొలగించాలి.. లేకుంటే...

శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరును తొలగించాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (వీహెచ్) కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరును తొలగించాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (వీహెచ్) కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే రైల్ రోకో నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ అంశంపై చర్చించేందుకు వీహెచ్ అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడారు. ఎంఐఎంకు ఎప్పుడో తలాక్ చెప్పేశామని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీతో ఎటువంటి అవగాహన ఉండదని వీహెచ్ స్పష్టం చేశారు. ఒక నేతకు రెండు పదవులు ఇవ్వద్దని పార్టీ అధిష్టానానికి సూచిస్తామని వీహెచ్ వెల్లడించారు.  

 శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు తొలిగింపునకు చేపట్టాల్సిన కార్యచరణ కోసం చేపట్టిన ఈ భేటీలో సీనియరు నేతల నుంచి స్పందన కరువైంది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, జానారెడ్డి, బలరాంనాయక్, పొన్నం ప్రభాకర్లు మాత్రమే హాజరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement