3 నెలల్లో 50వేల మంది కార్మికులు సిద్ధం!

Vemula Prashanth Reddy Special Interview with Sakshi

నిర్మాణ రంగానికి మళ్లీ ఊపు రావడం తథ్యం

తరలిన వలస కార్మికులంతా త్వరలోనే వస్తారు

ఉపాధికి నిర్మాణ సంస్థలతో కలిసి కార్యాచరణ

సాక్షితో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ‘దేశంలో వేగంగా విస్తరిస్తూ పురోగమిస్తున్న నగరాల్లో హైదరాబాద్‌ ముందుంది. కొన్నేళ్లుగా ని ర్మాణరంగం మరింత వేగాన్ని పుంజుకుంది. సరిగ్గా ఈ స మయంలోనే కరోనా అడ్డు తగిలింది. వలస కూలీలు సొం తప్రాంతాలకు తరలివెళ్లారు. ఫలితంగా నిర్మాణ రంగం కు దేలైంది. ఇప్పుడు దాన్ని పట్టాలెక్కించి పరుగులు పెట్టిం చేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కేవలం 3 నెలల్లోనే 50 వేల మంది కార్మికులను సిద్ధం చేయనున్నాం. వెరసి కొద్ది రోజుల్లోనే నిర్మాణ రంగం మళ్లీ ఊపందుకుంటుంది’ అని రోడ్లు, భవనాల శాఖ మం త్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. శనివారం ఆయన ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, న్యాక్‌ డీజీ భిక్షప తి, ఇతర నిర్మాణసంస్థల ప్రతినిధులతో కలిసి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అనంతరం ‘సాక్షి’తో పంచుకున్న వివరాలు ఆయన మాటల్లోనే..

న్యాక్‌ శిక్షణతో ఉపాధి: అందుబాటులో ఉన్న వారిలో ఎంతమందికి నిర్మాణ రంగంలో పనిచేసిన అనుభవం ఉం దో గుర్తించి వారిని పనుల్లోకి తీసుకోబోతున్నాం. దీనికి ని ర్మాణ సంస్థలతో కూడిన బీఏఐ, క్రెడాయ్, ట్రెడా, టీబీ ఎ ఫ్, ఐజీబీసీ సంస్థలు, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌) సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాయి. ప్రభుత్వ ఆదేశంతో ప్రత్యేకంగా జ్టి్టpట://్టటn్చఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ రూపొందించి శనివారం ప్రారంభించాం. వేరే ప్రాం తాల నుంచి వచ్చిన తెలుగు కార్మికులు తమ వివరాలను ఇందులో అప్‌లోడ్‌ చేయాలి. ఏ రంగంలో నిష్ణాతులో తెలపాలి. ఆ వివరాలను ఈ 5 సంస్థలకు అందిస్తాం. వాటి ద్వారా వారికి ఉపాధి చూపుతాం. నిర్మాణ రంగంలో నైపుణ్యమున్న వారికి వెంటనే ఆ రంగంలో ఉపాధి చూపుతాం. ఇతర రంగాల్లోని వారికీ నిర్మాణ రంగంపై ఆసక్తి ఉంటే న్యాక్‌ ద్వారా శిక్షణ ఇప్పించి సిద్ధం చేస్తాం. 
జిల్లా, నియోజకవర్గస్థాయికి ‘న్యాక్‌’: పేదలకు సంక్షేమ పథకాలు, రైతులకు ప్రాజెక్టులు–రైతుబంధులాంటి స్కీ మ్స్‌ ఉన్నట్టే మూడో కేటగిరీగా ఉపాధి రంగాన్ని పటిష్టపరచాలన్నది సీఎం ఆలోచన. ఇందుకోసం న్యాక్‌ను పటిష్టపరచాలని ఆదేశించారు. ఆ మేరకు ఆ సంస్థను జిల్లా కేంద్రం, నియోజకవర్గ కేంద్ర స్థాయికి చేర్చాలని ప్రణాళికలు సిద్ధం చేశాం. నిరుద్యోగ యువతను గుర్తించి ఆసక్తి ఉన్న రంగం లో ఉపాధి కల్పించేలా న్యాక్‌ ద్వారా నైపుణ్యాన్ని కల్పిస్తాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉపాధి కల్పిస్తాం

తెలంగాణ అంటే నమ్మకం: ఇటీవల వలస కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లేప్పుడు.. రైలు బయల్దేరగానే ‘జై కేసీఆర్, జై తెలంగాణ, హమ్‌ ఫిర్‌ లౌటాయింగే’ అంటూ నినాదాలిచ్చారు. దేశంలోనే తెలంగాణ ఉపాధికి మంచి కేంద్రమన్న భావన, నమ్మకం చాలామందిలో ఉన్నాయి. సొంత ప్రాంతాలకు వెళ్లినవారంతా త్వరలోనే తిరిగొస్తారు.

50 వేల మంది అందుబాటులో..
కరోనా భయంతో 7 లక్షల నుంచి 10 లక్షల మంది సొంత ప్రాంతాలకు తరలిపోయారు. దాదాపు అంతే సంఖ్యలో ఇక్కడే ఉన్నారు. వారిక్కడే ఉండేలా పూర్తి భరోసా కల్పిస్తున్నాం. వెళ్లిన వారిలో సగం మంది మళ్లీ వచ్చే అవకాశం ఉంది. నిర్మాణ రంగం పురోగతికి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటుచేసి కార్యాచరణ ప్రారం భించాం. కరోనా నేపథ్యంలో గల్ఫ్‌ దేశాల నుంచి దాదాపు 10వేల మందికి పైగా తెలంగాణ కార్మికులు వచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి మరో 40 వేల మంది వచ్చారు. వెరసి 50 వేల మంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వీరందరికీ ఇక్కడే ఉపాధి చూపుతాం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top