‘వ్యాట్’ సవరణపై సభలో 2 బిల్లులు | Sakshi
Sakshi News home page

‘వ్యాట్’ సవరణపై సభలో 2 బిల్లులు

Published Sat, Dec 20 2014 1:07 AM

'VAT' remediation bills in the House 2

సాక్షి, హైదరాబాద్: విలువ ఆధారిత పన్ను(వ్యాట్) సవరణకు సంబంధించి రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదం నిమిత్తం ఏపీ ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ప్రతి పాదించింది. ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ సవరణ బిల్లులను సభలో ప్రతిపాదించారు. ఇది ఇప్పటికే ఆర్డినెన్సుగా అమల్లో ఉంది.
 
హాఏపీ విలువ ఆధారిత పన్ను
రెండో సవరణ చట్టం - 2014
ఇది విమాన (వైమానిక టర్బైన్) ఇంధనంపై  విలువ ఆధారిత పన్నును 16 నుంచి ఒక శాతానికి తగ్గించేందుకు సంబంధించిన బిల్లు. విమాన ఇంధనంపై వ్యాట్‌ను ఒక శాతంగా అమలు చేస్తూ ప్రభుత్వం గత సెప్టెంబరు 20వ తేదీ ఆర్డినెన్సు తెచ్చింది.  అసెంబ్లీ ఆమోదానికి బిల్లును పెట్టారు.
 
హాఏపీ విలువ ఆధారిత పన్ను
సవరణ చట్టం - 2014
నెలవారీ వ్యాట్ కింద రిటర్నులు సమర్పించే సమయంలోనే డీలర్లు సరుకుల అమ్మకాలు, కొనుగోలు బిల్లులు కూడా సమర్పించాలని ఈ బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. సరుకులను రవాణా చేసే వాహనంలో ఇన్‌వాయిస్/ డెలివరీ చలానులతోపాటు వే బిల్లులను కూడా జత చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటరీకరించాలి. దీనివల్ల చెక్‌పోస్టుల్లో ఆన్‌లైన్ ద్వారా రసీదులు, సరుకులను తేలిగ్గా సరిచూడవచ్చు. పన్ను ఎగవేత, జీరో ట్యాక్స్ కట్టడిలో భాగంగానే ఈ సవరణ బిల్లును ప్రతిపాదించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement