మరికాసేపట్లో టీపీసీసీ చైర్మన్గా ఉత్తమ్ బాధ్యతలు | uttamkumarreddy assumes charge to day as tpcc chirman | Sakshi
Sakshi News home page

మరికాసేపట్లో టీపీసీసీ చైర్మన్గా ఉత్తమ్ బాధ్యతలు

Mar 8 2015 2:21 PM | Updated on Oct 8 2018 9:21 PM

మరికాసేపట్లో టీపీసీసీ చైర్మన్గా ఉత్తమ్ బాధ్యతలు - Sakshi

మరికాసేపట్లో టీపీసీసీ చైర్మన్గా ఉత్తమ్ బాధ్యతలు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్షుడిగా నియామకమైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం సాయంత్రం 3 గంటలకు గాంధీభవన్లో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్షుడిగా నియామకమైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం సాయంత్రం 3 గంటలకు గాంధీభవన్లో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం ఆయన బంజారా హిల్స్లోని తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి పొన్నాల నివాసానికి వెళ్లారు. అక్కడ నుంచి పొన్నాలతో కలిసి గాంధీ భవన్ కు వెళతారు. అంతకుముందు ఉత్తమ్ ఇంటికి వెళ్లి మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఏఐసీసీ ఇటీవలె ఉత్తమ్కుమార్ రెడ్డిని పీసీసీ చీఫ్గా, మల్లు భట్టి విక్రమార్కను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement