‘ప్రత్యేక తెలంగాణలో ప్రజాస్వామ్యానికి మనుగడ లేకుండా పోయిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు.
కేంద్ర రాష్ట్రాల్లో మూడేళ్ల పాలనలో మోదీ, కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలూ కలగలేదనే అంశాన్ని రాష్ట్రమంతటా చాటేందుకే రాహుల్‌గాంధీ వచ్చారన్నారు. ‘ఆంధ్ర ప్రాంతంలో అధికారం కోల్పోతున్నామని తెలిసినా ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి, చలించి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. కానీ మూడేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఏ మేలూ జరగలేదు. విభజన బిల్లులోని ఏ హామీ అమలుకు నోచలేదు. ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ, ఎయిమ్స్ వంటివేమీ రాలేదు’ అన్నారు. దాశరథి, కాళోజీ కవితా పంక్తులను ఉటంకిస్తూ.. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.