
అకాల వర్షం : నీటమునిగిన మిర్చి
వరంగల్ జిల్లా ఏటూరునాగారం పరిధిలో శుక్రవారం భారీ వర్షం కురిసింది.
ఏటూరునాగారం : వరంగల్ జిల్లా ఏటూరునాగారం పరిధిలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి పొలంలో ఉన్న మిర్చి నీటిపాలైంది. మిర్చితో పాటు మిగతా పంటలకు నష్టం చేకూరింది.
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెల్సిందే. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కురవడం వల్ల తీవ్రంగా నష్టపోతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు.