విద్యార్థిని గొంతు కోసి పరారైన ఆగంతకులు | Unknown persons attacked on student at Nagarjuna Sagar | Sakshi
Sakshi News home page

విద్యార్థిని గొంతు కోసి పరారైన ఆగంతకులు

Apr 19 2014 10:01 AM | Updated on Nov 9 2018 4:59 PM

విద్యార్థిని గొంతు కోసి పరారైన ఆగంతకులు - Sakshi

విద్యార్థిని గొంతు కోసి పరారైన ఆగంతకులు

నల్లొండ జిల్లాలో నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. శనివారం ఉదయం స్కూల్కి వెళ్తున్న దివ్యపై కొంత మంది ఆగంతకులు దాడి చేశారు.

నల్లొండ జిల్లాలో నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. శనివారం ఉదయం స్కూల్కి వెళ్తున్న దివ్యపై కొంత మంది ఆగంతకులు దాడి చేశారు. అనంతరం ఆమె గొంతు కోసి పరారైయ్యారు. దాంతో దివ్య రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్థానికుల సహాయంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే దివ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా దివ్యపై దాడి ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులను పోలీసులు విచారిస్తున్నారు. ఆగంతకులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement