breaking news
	
		
	
  attacked on student
- 
  
    
                
      Viral Video: బర్రెను తన్నాడు.. బోర్లా పడ్డాడు
 - 
      
                   
                               
                   
            విద్యార్థిని గొంతు కోసి పరారైన ఆగంతకులు

 నల్లొండ జిల్లాలో నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. శనివారం ఉదయం స్కూల్‌కి వెళ్తున్న దివ్యపై కొంత మంది ఆగంతకులు దాడి చేశారు. అనంతరం ఆమె గొంతు కోసి పరారైయ్యారు. దాంతో దివ్య రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్థానికుల సహాయంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే దివ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా దివ్యపై దాడి ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులను పోలీసులు విచారిస్తున్నారు. ఆగంతకులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. 


