నాలాలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకువచ్చింది. ఈ ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది.
అంబర్‌పేట (హైదరాబాద్) : నాలాలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకువచ్చింది. ఈ ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఇన్‌స్పెక్టర్ డి.రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... గుర్తుతెలియని వ్యక్తి (సుమారు 28 సంవత్సరాలు) మృతదేహం నల్లకుంటలోని గాంధీనగర్ (లంక) వెనుక భాగంలోఉన్న నాలాలో కొట్టుకు వచ్చింది.
రెండు రోజుల క్రితమే ఆ వ్యక్తి నాలాలో పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం ఉబ్బి ఉండటంతో పైకి తేలిందని తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతదేహంపై చిన్నచిన్న గాయాలు కనిపించగా, ఒంటిపైన నీలిరంగు బనియన్ ఉంది.