నీళ్లు చల్లి చూడండి! 

In the United States there is no snow falling - Sakshi

గాల్లోకి వేడి నీళ్లు చల్లి చూడండి.. ఏం జరుగుతుంది. ఎక్కడైనా అయితే అవే నీళ్లు కింద పడతాయి. కానీ అమెరికాలో అదీ గడ్డకట్టుకుపోయే మంచుగాలుల్లో వేడి నీళ్లు చల్లితే గాల్లోనే గడ్డకట్టి వేడినీళ్ల స్ఫటికాలుగా మారి కుప్పలా నేల రాలుతున్నాయి. అదెలాగో చూడండి.. అమెరికాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుకు అక్కడి సాధారణ పౌరుల జీవనం అస్తవ్యస్తంగా తయారయ్యింది. పాఠశాలలు మూతపడ్డాయి. ఆఫీసులకు సెలవులు ప్రకటించేశారు. తపాలా కార్యాలయాలు సైతం పనిచేయని స్థితికి చేరింది.  రైళ్ల రాకపోకలు సైతం నిలిచిపోయాయి. విమానాలు గాల్లోకి ఎగిరే పరిస్థితి లేక నేలమీదే చతికిలపడ్డాయి.

మంచు తప్ప వీధుల్లో మనుషుల అలికిడే లేకుండా పోయింది. ఈ పరిస్థితులతో విసిగిపోయిన ప్రజలు మంచు వాన నుంచి కాస్త ఊరట పొందేందుకు వినోదం కోసం వేడి నీళ్లను గాలిలోకి చల్లుతున్నారు. అయితే చల్లిన వేడి నీళ్లు సైతం భూమ్మీద రాలకుండానే క్షణాల్లో గడ్డకట్టుకుపోయి వేడి నీటి బిందువులుగా నేల రాలుతున్నాయి. ఈ విచిత్రమైన పరిస్థితిని వీడియోల్లో షూట్‌ చేసి విసుగు పుట్టించే అవిశ్రాంత మంచువాన నుంచి వినోదం పొందుతున్నారు. ఇంట్లో కప్పులు, మగ్గులతో వేడినీళ్లు గాల్లోకి చల్లి గడ్డకట్టే సీన్‌ను వీడియోల్లో బంధించి, ఈ వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. అవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అవుతున్నాయి.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top