బీజేపీలో చేరిన ఇద్దరు టీడీపీ నేతలు | Two TDP leaders who joined the BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన ఇద్దరు టీడీపీ నేతలు

Jun 2 2019 6:13 AM | Updated on Jun 2 2019 6:13 AM

Two TDP leaders who joined the BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు దేశం పార్టీ (టీడీపీ) సీనియర్‌ నేతలిద్దరు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ సురేశ్‌రెడ్డి బీజేపీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను ఈ ఇద్దరు నేతలు మర్యాదపూర్వ కంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబం ధించిన పలు అంశాలపై రాంమాధవ్‌ వారితో చర్చించినట్లు తెలిసింది. అనంతరం వీరి చేరికతో పార్టీ బలోపేతం అవుతుందని రాంమాధవ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పేర్కొన్నారు. దీంతో బీజేపీలో వీరి చేరిక ధ్రువీకరించినట్లయింది.

Advertisement
 
Advertisement
Advertisement