పాఠశాలకు వెళ్తున్న ఇద్దరు చిన్నారులకు రోడ్డు పక్కన స్ప్రైట్ బాటిల్ కనిపించింది. దీంతో ఇద్దరు చిన్నారులు అందులో స్ప్రైట్ ఉందనుకొని తీసుకొని తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
మంచిర్యాల టౌన్ (ఆదిలాబాద్) : పాఠశాలకు వెళ్తున్న ఇద్దరు చిన్నారులకు రోడ్డు పక్కన స్ప్రైట్ బాటిల్ కనిపించింది. దీంతో ఇద్దరు చిన్నారులు అందులో స్ప్రైట్ ఉందనుకొని తీసుకొని తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆ స్ప్రైట్ బాటిల్‌లో పురుగుల మందు ఉండటంతోటే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా దహెగాం మండలంలోని తిమ్మాపూర్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన ఆకుల ఆంజనేయ ప్రసాద్(11), సోమిశెట్టి అజయ్(11) అనే ఇద్దరు చిన్నారులు స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం పాఠశాలకు వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన స్ప్రైట్ బాటిల్ కనిపంచడంతో ఇద్దరు తాగారు. దీంతో వారి పరిస్థితి విషమంచింది. ఇది గుర్తించిన స్థానికులు వారిని మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.